Wednesday, October 12, 2011

సౌందర్యానికి

కావలసినవి:
కొమ్ము సెనగలు - పావు కిలో
నెయ్యి - రెండు చెంచాలు
ఛాయ పసుపు - రెండు చెంచాలు

విధానం:
కొమ్ము సెనగలు, రెండు చెంచాలు నెయ్యి వేసి దోరగా వేయించాలి. చల్లారిన తర్వాత మెత్తగా పొడి చేసుకోవాలి. పొడిగా వున్నా సీసాలో భద్రపరుచు కోవాలి.

వాడవలసిన విధానం:
ప్రతిరోజూ ముఖాన్ని శుభ్రం చేసుకుని, సరిపడినంత సెనగల పొడిని, రెండు చెంచాలు ఛాయ పసుపు, తగినన్ని పచ్చి పాలు వేసి కలిపి చాలా వత్హుగా ముఖానికి పట్టించాలి. ఎండుతూ ఉండగానే అంటే ఒక పది లేక పదిహేను నిమిషాలు వుంచి నీటితో (సబ్బు వాడకుండా) శుభ్రం చేసుకోవాలి.

ఉపయోగాలు:
ముఖం పై వుండే మచ్చలు, చిన్న చిన్న పొక్కులు, మొటిమలు తగ్గి, ముఖం అంతా ఒకే రంగులోకి వస్తుంది. రోజూ వాడితే రంగు మెరుగుపడుతుంది.

గమనిక: ఏల్చూరి ఆయుర్వేదం సౌజన్యంతో